సోమరితనం మాత్రమే అదృష్టం కోసం ఎదురుచూస్తుంది
గురువారం, 30 మార్చి 2017 (22:14 IST)
అనువుగాని చోట, మనదికాని చోట, మన గురించి తెలియని మనుష్యుల మధ్య వుండి, సుఖశాంతులు, విశ్రాంతి పొందగలమనుకోవడం దూరపు కొండలు నునుపు అనిపించడమే.
సోమరితనం మాత్రమే అదృష్టం కోసం ఎదురుచూస్తుంది.
స్వయంకృషి చేతనే యోగ్యతను పొందగలం. ఒకటి పొందాలి అంటే మరొకటి వదులుకోవాలి.
స్వేచ్ఛగా, స్వచ్ఛంగా, దాపరికం లేకుండా మాట్లాడు.
రోగం వున్నా ఆరోగ్యంగానే తిరుగుతుంటారు కొందరు. రోగం లేకున్నా ఎప్పుడూ ఏదో అనారోగ్యంతో బాధపడుతుంటారు మరికొందరు. ఇందుకు మూలం మన శరీర మానసిక తత్వం.
అయినవాడ్ని ఎందుకు దూరం చేసుకుంటావ్?
కష్టజీవి ఇంట ప్రతినిత్యం ధనలక్ష్మి కొలువుంటుంది
ఇప్పటి నీ మంచితనం, ఇప్పుడు నీవు చేసే మంచి పనులే చివరికి నీకు ఆసరాగా నిలుస్తాయి.
ఏమీ తినకుండా పరగడపున ఆకలి బాధతో దర్శనం చేసుకుంటేనేనా పుణ్యం?
ఏవేవో అనవసరపు ఆలోచనలు చేయడం కంటే నీ గురించి నీవు ఆలోచించుకో. నీ గురించి నీవు తెలుసుకో.
అలవికాని కోరికలు, అక్కరకు రాని ఆలోచనలు అశాంతిని, వేదనను కలిగిస్తాయి.
దాహం వేసినప్పుడు మంచినీళ్లు ఇచ్చి దప్పిక తీర్చిన మహానుభావుడికి అతనికి అవసరమైనప్పుడు పాలిచ్చి మాత్రమే నీ రుణం తీర్చుకో.