పెళ్లి - ఉద్యోగం భవిష్యత్ వివరాలు చెప్పగలరు

ఎ. చైతన్యభాను-హైదరాబాద్:
మీరు తదియ బుధవారం మేష లగ్నము శ్రవణా నక్షత్రం మకరరాశి నందు జన్మించారు. భార్య స్థానము నందు కుజుడు ఉండటం వల్ల, లగ్నము తప్ప మిగిలిన గ్రహాలన్నీ రాహు, కేతువుల మధ్య బంధించబడటం వల్ల, శేషనాగ కాలసర్పదోషం ఏర్పడటం వల్ల రాహు, కేతు, కుజులకు శాంతి చేయించినట్లైతే మీకు శుభం కలుగుతుంది.

మీరు ఉద్యోగ రంగంలో మంచి పేరు, ఖ్యాతి పొందుతారు. మీ 26 లేక 27 సంవత్సరము నందు వివాహం అవుతుంది. 2002 నుంచి రాహు మహర్ధశ ప్రారంభమైంది. ఈ రాహు అక్టోబర్ నుంచి మంచి యోగాన్నిస్తుంది. 2020 నుంచి గురు మహర్ధశ 16 సంవత్సరములు మంచి యోగాన్నిస్తుంది.

మీ ప్రశ్నలను [email protected]tకు పంపించండి.

వెబ్దునియా పై చదవండి