మీరు చవితి గురువారం సింహలగ్నము, చిత్తానక్షత్రం కన్యారాశి నందు జన్మించారు. రాజ్యస్థానము నందు రాహువు ఉండటం వల్ల ఆరోగ్యములో చికాకులు వంటివి ఎదుర్కొంటున్నారు.
2015 వరకు ఏలినాటి శనిదోషం ఉన్నందువల్ల నెలకు ఒక శనివారం నాడు 17సార్లు నవగ్రహ ప్రదక్షణ చేసిన నువ్వుల నూనెతో శనికి దీపారాధన చేయండి. 2011 నందు ప్రభుత్వ రంగ సంస్థల్లో స్థిరపడతారు. 2011 ఆగష్టు నుంచి 2012 మే లోపు మీకు వివాహం అవుతుంది.