మీ ఇంటి ఆవరణలో బావి ఏ దిశలో ఉంది?

ఇంటి ఆవరణలో ఈశాన్య దిశగాని, తూర్పు, ఉత్తర దిశలోగాని బావి తవ్వడం మంచిదని వాస్తు శాస్త్ర నిపుణులు అంటున్నారు. అన్ని దిశల కంటే ఈశాన్య దిశలో బావి తవ్వడం శ్రేయస్కరమని వారు చెబుతున్నారు.

అయితే ఆగ్నేయ, దక్షిణ, నైరుతి, వాయువ్య దిశలలో బావి తవ్వకూడదు. ఇల్లు కట్టే ముందు ప్రహరీ గోడలు నిర్మించి, ముందు ఈశాన్యంలో బావి తవ్వి, నీరు పడ్డాక నిర్మాణం ప్రారంభించడం శ్రేయస్కరం. ఇంటి మధ్యభాగంలో బావి ఉంటే అరిష్టానికి దారితీస్తుందని వాస్తు శాస్త్రం చెబుతోంది.

ఇకపోతే.. పంచాంగం ప్రకారం రోహిణి నక్షత్రం, సూర్య సంచార కాలంలో బావి తవ్వడం మంచిది. తెల్లవారు జాము నుంచి మధ్యాహ్నం లోపే బావి తవ్వడానికి అనుకూలం. చైత్ర, విశాఖ మాసాల్లో బావి తవ్వడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయని వాస్తు నిపుణులు అంటున్నారు. అదేవిధంగా సోమ, శుక్ర, బుధ, గురు, ఆదివారాల్లో బావి తవ్వడం మంచిది.

వెబ్దునియా పై చదవండి