హనుమంతుడిని పూజిస్తే కార్యసిద్ధి అవుతుంది అంటారు ఎలా?

FILE
రామాయణ సుందరకాండలో సీతమ్మవారు తన కార్యం పూర్తి చేసి పెట్టమని హనుమంతులవారిని కోరింది. నాయనా ! హనుమా! నా యీపని చేసి పెట్టడానికి నీవే సమర్థుడవు. నీవు గట్టిగా ప్రయత్నం చేసి రాఘవుడు దీనికి పూనుకొనేటట్లు చెయ్యి. నన్ను ఈ రావణ చెరనుండి విడిపించడానికి రాముడు పూనుకుంటాడు అని సీతమ్మ చెప్పింది. సీతమ్మ కోరినట్లుగా హనుమంతుడు ప్రయత్నం చేశాడు.

సీతమ్మ లంకలో వుంది మనం బయల్దేరుదాం. సముద్రానికి సేతువును కడదాం. రావణాసురుడిని చంపి, నీతో కలిసి రామచంద్రుడు పట్టాభిషిక్తుడవుతాడు అని సీతమ్మతో చెప్పి వచ్చాను - అంటూ ఆంజనేయస్వామి శ్రీరామచంద్రుడిని ఉత్సాహపరిచాడు. అటు సీతమ్మ ప్రాణాలను కాపాడాడు. ఇటు రాముడిని సమాయత్తపరిచాడు. ఇదే ఆంజనేయస్వామి యొక్క కార్యసాధన.

వెబ్దునియా పై చదవండి