రథసప్తమి : 6న సూర్యునికి ఎర్రచామంతి పువ్వులు సమర్పిస్తే?

మంగళవారం, 4 ఫిబ్రవరి 2014 (17:27 IST)
FILE
రథసప్తమి రోజున సూర్యభగవానుడిని దర్శించుకుంటే సర్వపాపాలు తొలగిపోయి పుణ్యఫలం సిద్ధిస్తుంది. ఆదిత్యుని జన్మదినమైన రథసప్తమిరోజున సూర్యోదయానికి ముందే లేచి.. పూజామందిరాన్ని శుభ్రపరుచుకుని... పసుపు, కుంకుమ, పువ్వులు, ముగ్గులతో అలంకరించుకోవాలి.

మగవారైతే స్నానం చేసే నీటిలో జిల్లేడు ఆకులను వేసుకుని ఆ నీటితో స్నానం చేయాలి. అదే మహిళలైతే.. చిక్కుడు ఆకులతో స్నానం చేయడం మంచిది. తర్వాత ఎర్రటి పట్టుబట్టలు ధరించి, ఆదిత్యునిని నిష్ఠతో స్తుతించాలి. రథసప్తమి రోజున సూర్యభగవానుడికి కనకంబరాలు, ఎర్రచామంతి పువ్వులను సమర్పించే వారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని విశ్వాసం.

పూజకు అనంతరం ఆదిత్యునికి ఎర్రటి పండ్లు, చిక్కుడు కాయలతో చేసిన పొంగలి, బూరెలను నైవేద్యంగా సమర్పించుకోవచ్చు. ఇదే రోజున సూర్య అష్టోత్తరము, సూర్యాష్టకమ్‌‌ను పఠించడం మంచిది. ఆదిత్యారాధన పారాయణ చేసి సూర్యభగవానుడిని దర్శనం చేసుకోవాలి.

ఇందులో ముఖ్యంగా అరసవల్లి, గొల్లలమామిడాడ, పెద్దాపురం వంటి ప్రాంతాల్లో వెలసిన సూర్యదేవాలయాన్ని సందర్శించుకోవడం ద్వారా కోటి జన్మల పుణ్యఫలాన్ని పొందవచ్చునని పండితులు చెబుతున్నారు.

వెబ్దునియా పై చదవండి