జూలై 10 నుంచి తిరుమలలో అద్దె గదులకు జిఎస్టి వర్తించదు...

సోమవారం, 10 జులై 2017 (14:46 IST)
కేంద్ర ప్రభుత్వ జిఎస్టి ప్రభావం తిరుమల తిరుపతి దేవస్థానంపై పడుతుందని అందరూ భావించారు. మొదట్లో దీన్ని పూర్తిగా వ్యతిరేకించారు. అయితే ప్రస్తుతం ఆ ప్రభావాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తోంది టిటిడి. వెయ్యి రూపాయలకు తక్కువగా వుండే అద్దె గదులను తీసుకునే భక్తులకు జిఎస్టీ వర్తించకుండా టిటిడి నిర్ణయం తీసుకుంటోంది. అయితే మిగిలిన గదులకు సంబంధించి యథాతథంగా జిఎస్టీని అమలు చేయనున్నారు. సామాన్య భక్తులపై ఎలాంటి భారం లేకుండా చేయాలన్నదే టిటిడి ఆలోచన. అందుకే వెయ్యికి తక్కువ గదులను అద్దెకు తీసుకునే వారిపై జిఎస్టీ భారం పడదు. 
 
జూలై 10వ తేదీ నుంచే దీన్ని అమలు చేయాలని నిర్ణయించుకున్నారు. 2 వేల రూపాయల గదిని అద్దెకు తీసుకుంటే 12శాతం జిఎస్టీ భారం పడుతుంది. ఆ లెక్కనైతే 1500 రూపాయల గదికి 1518 రూపాయల అద్దెతో పాటు జిఎస్టీ కలిపి 1700 రూపాయలవుతుంది. అలాగే 2 వేల రూపాయల గదికి 1964 సవరించిన అద్దెతో పాటు జిఎస్టీ కలిపితే 2,200 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే 2,500 రూపాయల నుంచి 6 వేల రూపాయల వరకు ఉన్న అద్దె గదులపై జిఎస్టీ ప్రభావం 18 శాతం పడనుంది.

వెబ్దునియా పై చదవండి