తిరుమల శ్రీవారి దర్శన భాగ్యం గంటలోనే.....

శనివారం, 30 ఏప్రియల్ 2016 (12:26 IST)
కలియుగ వైకుంఠుడు శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శన భాగ్యం గంటలోనే భక్తులకు లభిస్తోంది. శుక్రవారం రద్దీగా తిరుమల శనివారం ఖాళీగా కనిపిస్తోంది. సర్వదర్శనంతో పాటు కాలినడక లైన్లు బోసిపోయి కనిపిస్తున్నాయి. శనివారం ఉదయం 5 గంటల నుంచి సర్వదర్శనం కోసం 5 కంపార్టుమెంటులోను, కాలినడక భక్తులు రెండు కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు.
 
కాలినడకతో పాటు సర్వదర్శనం భక్తులకు గంటలోనే దర్శనం పూర్తవుతోంది. శుక్రవారం శ్రీవారిని 68,418 మంది భక్తులు దర్శించుకోగా హుండీ ఆదాయం రూ.2.34లక్షలుగా వసూలైంది. 

వెబ్దునియా పై చదవండి