సాధారణంగా పెళ్లి తర్వాత నూతన దంపతులు తమకునచ్చిన చోటుకి హనీమూన్‌కు వెళుతుంటారు. అలా వెళ్లివచ్చాక తమ అనుభవాలను స్నేహితుల వద్ద షేర్ చేసుకుంటారు. అయితే, ఆ యువతి మాత్రం తన హనీమూన్ అనుభవాలను మాత్రం ఏకంగా తల్లికి వివరించింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు వైరల్‌గా మారింది. ఈ వీడియోను 33 లక్షల పైచిలుకు మంది వీక్షించడం గమనార్హం.
ఇటీవల గోవాకు హనీమూన్‌కు వెళ్లొచ్చిన ఓ యువతి తన తల్లితో తన అనుభవాలను ఎలా చేసుకుందో ఈ వీడియోలో చూడొచ్చు. మొత్తం 9 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో తల్లీ కూతుళ్లు సెక్స్, భావప్రాప్తిలాంటి విషయాలపై మాట్లాడినప్పటికీ.. వాళ్ల మాటలన్నీ పరోక్షంగానే ఉండటం గమనార్హం.