మకర సంక్రాంతి పర్వదినాన ఎట్టి పరిస్థితుల్లోనూ నాన్ వెజ్ ఆహారాన్ని తీసుకోకూడదు. మాంసం, మద్యం, వెల్లుల్లి, ఉల్లిపాయలను తమ ఆహారంలో తీసుకోకుండా ఉంటేనే మంచిది. ఆకుకూరలు, శాకాహారం తీసుకోవాలి.
మకర సంక్రాంతి రోజున పవిత్ర నదులలో స్నానం చేయడం వల్ల పాపం నుండి విముక్తి, మోక్షం లభిస్తుంది. గంగా స్నానం ఉత్తమం. మకర సంక్రాంతి రోజున, ప్రతి ఒక్కరూ తన పూర్వీకుల పేరిట తర్పణం చేయాలి. ఈ కారణంగా ఇంట్లో పితృదోషం తొలగిపోతుంది. ఈ రోజున, మహారాజ్ భగీరథుడు తన పూర్వీకుల ఆత్మలకు శాంతి కోసం గంగానదిలో తర్పణం చేస్తారని పురాణాలు చెప్తున్నాయి.