అలుపెరుగని పరుగుల వీరుడు

సోమవారం, 18 అక్టోబరు 2021 (08:46 IST)
విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం అలజంగి గ్రామ యువకుడు రాపాక గణేష్ పరుగుల పతాకల వర్షం కురిపిస్తున్నాడు జూన్ నెలలో రాజమండ్రిలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీలో 100 మీటర్ల సీనియర్ విభాగంలో బంగారు పతకంని సాల్వ్ ఓ అసోసియేషన్ తరుపున ఆడి గెలుచుకుని నేషనల్ లో 400 మీటర్ల  విభాగంలో గోవాలో బంగారు పతకం సాధించారు.

అక్టోబర్ 10, 11 తేదీలలో గోవాలో ఎస్. జి .డి. ఎఫ్. ఐ తరుపున ఓపెన్ నేషనల్ సీనియర్  విభాగంలో 100 మీటర్లు 200 మీటర్లలలో బంగారు పతకాలు సాధించి తన సత్తా చాటారు ఈవెంట్ పీడం ఇంటర్నేషనల్ స్టేడియంలో లో  నిర్వహించారు ఇతని కోచ్లు హఫీజ్, ఆనంద్ బాబులు.

ఈయన ఇండియా తరఫున ఆడి  ఇండియాకు మంచి బంగారు పతకాన్ని తేవడమే తన కోరిక అని తెలియపరుస్తున్నారు. "ఇండో నేషనల్ టూర్కి ప్రవేశం లభించినందుకు ఆనందంగా ఉంది కానీ దానికి చాలా వరకూ ఖర్చు అవుతుంది. నా తండ్రి సాధారణమైన రైతు అవ్వడం వలన నిరాశ చెందుతున్నాను. దాతలు ఎవరైనా సహాయం చేస్తే తే తప్పకుండా ఇండో నేపాల్ టూర్ లో భారత్ తరఫున బంగారు పతకం సాధించగలనని" వ్యక్తపరుస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు