సానియా మీర్జాలా ఉండటం చాలా కష్టం.. మహిళల్ని జంతువుల్లా?

బుధవారం, 26 నవంబరు 2014 (10:41 IST)
‘ఈ దేశంలో సానియా మీర్జాలా ఉండటం చాలా కష్టం. మహిళా క్రీడాకారిణిగా నా కెరీర్‌లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను. నేను మహిళ నయినందుకే ఎన్నో వివాదాలు చుట్టుముట్టాయి. ఒకవేళ నేను పురుషుడిగా ఉంటే కొన్ని వివాదాలను తప్పించుకునే అవకాశముండేది’ అని తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్, స్టార్ టెన్నిస్ ప్లేయర్ సానియా వ్యాఖ్యానించింది.

‘క్రీడల్లో మరింత మంది మహిళలు రావాలంటే ఆలోచనా ధోరణిలో మార్పు రావాలి. ఈ విషయంలో ప్రభుత్వం కూడా చొరవ చూపాలి అని సానియా వ్యాఖ్యానించింది. 
 
భారత్‌లో క్రీడలపట్ల మరింత మంది మహిళలు ఆకర్షితులు కావాలంటే... ఆలోచనా ధోరణిలో మార్పు రావాల్సిన అవసరం ఉందని సానియా మీర్జా అభిప్రాయపడింది. ఐక్యరాజ్యసమితి (యూఎన్‌ఐ) దక్షిణాసియా మహిళల విభాగం గుడ్‌విల్ అంబాసిడర్‌గా సానియాను నియమించిన సంగతి తెలిసిందే. దక్షిణాసియా నుంచి ఈ గౌరవం పొందిన తొలి మహిళగా సానియా గుర్తింపు పొందింది.
 
మన సమాజంలో లింగ వివక్ష లేకుండా చేసేందుకు ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటోంది. ఈ విషయంలో మీడియా పాత్ర కూడా కీలకం’ అని సానియా తెలిపింది. ‘మహిళలు వివక్షకు గురవుతున్నారు. వారిని జంతువుల్లా చూస్తున్నారు. ఆలోచనా ధోరణిలో మార్పు రావాలి. మహిళలు కూడా తమకు ఏమాత్రం తీసిపోకుండా పనిచేయగలరని పురుషులు అర్థం చేసుకోవాలి’ అని సానియా వ్యాఖ్యానించింది.

వెబ్దునియా పై చదవండి