రియో ఒలింపిక్స్ : భారత్ ఖాతాలో పతకాలు 0.. ర్యాంకుల లిస్ట్‌లో స్థానమెంతో తెలుసా?

గురువారం, 11 ఆగస్టు 2016 (17:23 IST)
రియో డి జనీరో వేదికగా జరుగుతున్న విశ్వ క్రీడలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ఈ క్రీడల్లో మొత్తం 206 దేశాలకు చెందిన 11 వేలమంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. 125 కోట్ల మంది జనాభా కలిగిన భారత్ తరపున 108 మంది అథ్లెట్లు ఉన్నారు. ఇందులో స్టార్ ఆటగాళ్లు లియాండర్ పేస్, సానియా మీర్జా వంటి ప్రముఖులు ఉన్నారు. వీరిలో ఇప్పటికే పలువురు ఇంటి ముఖం పట్టారు. 
 
ఈనెల 5వ తేదీన ప్రారంభమైన ఈ క్రీడలు 17 రోజుల పాటు సాగుతాయి. అయితే, ఇప్పటికే 5 రోజుల ఆట ముగిసింది. కానీ, భారత్ ఖాతాలో ఒక్క పతకం కూడా చేరలేదు. భారత్‌కు మొదటి మెడల్‌ను ఎవరు అందిస్తారోనని అంతా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం భారత్ ర్యాంకింగ్ లిస్ట్‌లో 52వ స్థానంలో ఉంది. 11 గోల్డ్ మెడల్స్ సాధించిన అమెరికా ఫస్ట్ ప్లేస్‌లో ఉండగా, 10 బంగారు పతకాలతో చైనా రెండో స్థానంలో ఉంది. 
 
అమెరికా ఖాతాలో మొత్తం 11 బంగారు, 11 వెండి, 11 కాంస్య పతకాలు ఉన్నాయి. అలాగే, చైనా ఖాతాలో 10 బంగారు, 5 వెండి, 8 కాంస్య పతకాలు ఉన్నాయి. మూడో స్థానంలో ఉన్న జపాన్ ఖాతాలో 6 బంగారు, 5 వెండి, 11 కాంస్య పతకాలు ఉన్నాయి. 

వెబ్దునియా పై చదవండి