సుశీల్ కుమార్ నోరు విప్పట్లేదట.. ప్రాణహాని వుంది.. ఇదంతా కుట్రే అంటోన్న లాయర్!

గురువారం, 27 మే 2021 (16:03 IST)
యువ రెజ్లర్‌ హత్య కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత స్టార్‌ రెజ్లర్‌ సుశీల్‌ కుమార్‌కు ప్రాణహాని ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. అందుకే అతడిని కోర్టుకు హాజరు పరిచే సమయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అంతర్జాతీయ స్థాయిలో అపారమైన కీర్తిప్రతిష్ఠలు సాధించినా.. చెడు సాహవాసాల వల్ల దారితప్పిన సుశీల్‌కు తన పాత మిత్రులతోనే ప్రాణహాని ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. 
 
ఢిల్లీకి చెందిన ప్రముఖ గ్యాంగ్‌స్టర్‌ కాలా జఠేడి.. సుశీల్‌పై పగబట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. గతంలో కాలా జఠేడితో సంబంధాలు కొనసాగించిన సుశీల్‌.. అతడి సమీప బంధువైన సాగర్‌ రాణా తనపై బురదజల్లుతున్నాడనే అనుమానంతోనే హతమార్చినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. దీంతో కాలా జఠేడి.. సుశీల్‌కు హాని చేయొచ్చని అనుమానిస్తున్నారు.
 
యువ రెజ్లర్‌ సాగర్‌ రాణా హత్య కేసులో అరెస్టయిన సీనియర్‌ రెజ్లర్‌ సుశీల్‌ కుమార్‌ విచారణలో పోలీసులకు సహకరించడం లేదు. ఈ విషయాన్ని ఢిల్లీ పోలీసు క్రైం బ్రాంచ్‌ ఉన్నతాధికారి ఒకరు బుధవారం వెల్లడించారు. అలాగే సుశీల్ రాత్రంతా ఏడుస్తూ గడిపేస్తున్నాడని పోలీసులు తెలపా
 
ఆదివారం ఢిల్లీలో సుశీల్‌ను అరెస్ట్‌ చేసిన పోలీసులు.. కోర్టు అనుమతితో అతడిని ఆరురోజుల కస్టడీకి తీసుకున్న సంగతి తెలిసిందే. విచారణ సందర్భంగా.. గ్యాంగ్‌స్టర్లతో సంబంధాల విషయమై పోలీ సులు అడిగిన ప్రశ్నలకు సుశీల్‌ ఏమాత్రం నోరు మెదపడం లేదు. అక్కడ ఇరువర్గాల మధ్య సయోధ్య కుదిర్చేందుకే తాను వెళ్లినట్టు సుశీల్‌ చెప్పాడని ఆ అధికారి వెల్లడించారు. హత్యోదంతంలో ప్రమేయం ఉందని భావిస్తున్న నలుగురిని ప్రశ్నించనున్నట్టు పోలీసులు వెల్లడించారు.
 
అయితే హత్య కేసులో సుశీల్‌ను ప్రధాన నిందితుడిగా చేర్చడం వెనుక కుట్ర దాగి ఉందని అతడి తరఫు న్యాయవాది బీఎస్‌ జాఖర్‌ అన్నారు. సాగర్‌ సహా ఘర్షణలో గాయపడిన ముగ్గురిలో ఎవరూ సుశీల్‌ తమపై దాడి చేసినట్టు పోలీసులకు చెప్పలేదన్నారు. పెద్ద గ్యాంగ్‌స్టర్లను అరెస్ట్‌ చేసేందుకు కూడా గతంలో ఎన్నడూ కేవలం 10 రోజుల్లో నాన్‌ బెయిలబుల్‌ వారెంట్లు జారీ చేయలేదని, అలాగే నగదు రివార్డు కూడా ప్రకటించిన సందర్భాలు లేవన్నారు. ఇవన్నీ సుశీల్‌పై కుట్ర జరిగిందనేందుకు ఉదాహరణలుగా జాఖర్‌ చెప్పారు.
 
మరోవైపు రాణాపై దాడి సంఘటనలో ప్రత్యక్ష సాక్షులను పోలీసులు విచారించారు. ఎనిమిది మంది నుంచి స్టేట్‌మెంట్లు తీసుకున్నారని తెలిసింది. వారంతా సుశీల్‌కు వ్యతిరేకంగా చెప్పినట్టు సమాచారం. ఛత్రసాల్‌ ఘటన, దాడి సమయంలో దాచిపెట్టిన సెల్‌ఫోన్‌ గురించి సుశీల్‌ పోలీసులకు చెప్పాడట. అతడికి గ్యాంగ్‌స్టర్లతో ఉన్న సంబంధాల గురించి అధికారులు వేగంగా దర్యాప్తు చేస్తున్నారు. గ్యాంగ్‌స్టర్‌ కాలా జతేదీ సోదరుడు ప్రదీప్‌తో 2018, డిసెంబర్‌18న దిగిన పాత చిత్రాలు ప్రస్తుతం బయటపడ్డాయి. ప్రదీప్‌ తలపై రూ.7లక్షల బహుమానం ఉందని, విదేశాలకు పారిపోయాడని పోలీసులు తెలిపారు.
 
జూన్ 4న ఢిల్లీలోని ఛత్రశాల స్టేడియంలో సుశీల్ కుమార్, అతని స్నేహితులు 23 ఏళ్ల రెజ్లర్ సాగర్‌పై దాడి చేయగా.. అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచాడు. దాంతో.. దాదాపు 20 రోజులు పోలీసులకి చిక్కకుండా తప్పించుకున్న సుశీల్ కుమార్.. గత ఆదివారం మీరట్‌లో అరెస్టయ్యాడు. దాంతో.. అతడ్ని కోర్టులో ప్రవేశపెట్టగా.. ఆరో రోజుల రిమాండ్ విధించారు. మర్డర్ కేసు ఇన్వెస్టిగేషన్‌లో భాగంగా ఇప్పటికే క్రైమ్ సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేసిన పోలీసులు.. దాడి జరిగిన తీరుపై పూర్తి అవగాహనకి వచ్చారు.
 
సాగర్‌పై దాడిలో సుశీల్ కుమార్‌కి సహకరించిన అతని నలుగురు సహాయకుల్ని కూడా పోలీసులు తాజాగా అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు. ఈ క్రమంలో మొదట్లో గ్యాంగ్‌స్టర్ కాలాతో కలిసి పనిచేసిన సుశీల్ కుమార్.. అనంతరం విభేదాలతో రావడంతో అతని శత్రువైన నీరజ్‌తో సంబంధాలు కొనసాగించినట్లు విచారణలో తేలింది. ఢిల్లీలోని మోడల్ టౌన్‌లో ఉన్న సుశీల్ కుమార్ ఇంట్లో సాగర్ అద్దెకి ఉండగా.. ఈ గొడవ మొత్తానికి కారణం ఆ ఇల్లేనని తెలుస్తోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు