2012 ట్వంటీ-20 ప్రపంచ కప్ తర్వాత అబ్దుల్ రజాక్ రిటైర్
పాకిస్థాన్ ఆల్‌రౌండర్ అబ్దుల్ రజాక్ 2012 ట్వంటీ-20 ప్రపంచ కప్ తర్వాత రిటైర్ కావాలని భావిస్తున్నాడు. 31 సంవత్సరాల అబ్దుల్ రజాక్ దీనిపై మాట్లాడుతూ వచ్చే 2012లో జరుగనున్న ప్రపంచ ట్వంటీ-20 కప్ తర్వాత క్రికెట్‌కు స్వస్తి చెప్పాలన్నది తన ఆలోచనగా ఉందన్నారు.
ప్రతి సీనియర్ ఆటగాడు రిటైర్ కావాలని నిర్ణయం తీసుకోవడం ఎంతో బాధకు గురి చేస్తుందన్నారు. అయితే, మైదానంలో రాణింపు, ఫిట్‌నెస్ అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ప్రస్తుతం తన ఫామ్, ఫిట్‌నెస్‌ను పరిగణనలోకి తీసుకుంటే వచ్చే 2012 ప్రపంచ కప్ తర్వాత రిటైర్ కావాలని భావిస్తున్నట్టు చెప్పాడు.
ఈ మధ్యకాలంలో తన కెరీర్‌లో బాగా రాణించి క్రికెట్‌కు స్వస్తి చెప్పాలని భావిస్తున్నట్టు తెలిపారు. తనకు ఇది ఎంతో ముఖ్యమైన సమయమన్నారు.