జాతీయ రహదారి కావడం, కొన్ని చోట్ల ఫ్లైఓవర్ల నిర్మాణం జరుగుతున్న దృష్ట్యా మెట్రో స్టేషన్లు నిర్మించే ప్రాంతాలపై జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రహదారికి ఎటువైపు ఉన్నా మెట్రో స్టేషన్‌కు సులువుగా చేరుకునేందుకు వీలుగా వాటి స్థానాలను సర్దుబాటు చేస్తున్నారు.
హయత్ నగర్ నుంచి నిత్యం ఎంతోమంది నగరంలోని వేర్వేరు ప్రాంతాలు, ఐటీ కారిడారు రాకపోకలు సాగిస్తుంటారు. రహదారిపై రద్దీ దృష్ట్యా గంటల తరబడి ట్రాఫిక్‌లోనే గడపాల్సి వస్తోంది. మెట్రో రాకతో ప్రయాణం సులభతరంకానుంది. ఐటీ కారిడార్ వరకు అనుసంధానం ఏర్పడనుంది.