హైదరాబాద్ నగరంలో రెండు రోజుల పాటు నీటి సరఫరాను నిలిపివేయనున్నారు. ఈ నెల 9, 10 తేదీల్లో అనేక ప్రాంతాల్లో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నీటి సరఫరా ఉండదని హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు అధికారులు వెల్లడించారు. ఈ మేరకు వారు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. శని, ఆదివారాల్లో ఉస్మాన్ సాగర్, హకీంపేట ప్రాంతాల మధ్య జరుగుతున్న నీటి పైపులు మరమ్మతుల కారణంగా మార్చి 9వ తేదీన ఉదయం 6 గంటల నుంచి మార్చి 10 మధ్యాహ్నం 12 గంటల వరకు వివిధ ప్రాంతాల్లో నీటి సరఫరా నిలిచిపోతుందని తెలిపింది.
విజయనగర్ కాలనీ, హుమాయూన్ నగర్, కాకతీయ నగర్, సయ్యద్ నగర్, ఎంఈఎస్ ప్రాంతాలు, ఏసీ గార్డ్స్, రెడ్ హిల్స్, ఇన్కమ్ టాక్స్ ఏరియా, సచివాలయం, సీఐబీ క్వార్టర్స్, ఇందిరా నగర్, బీజేఆర్ కాలనీ, అడ్వొకేట్ కాలనీ, హిల్ కాలనీ, గోకుల్ నగర్, నాంపల్లి రైల్వే స్టేషన్, జంగం బస్తీ, అసెంబ్లీ, ఖైరతాబాద్, మల్లేపల్లి, లక్షీకాపూల్, సీతారాంబాగ్, గన్ ఫౌండ్రీ, చిరాగ్ అలీ లేన్, అబిడ్స్, న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్, బీఆర్కే భవన్, బిర్లా మందిర్, హిందీ నగర్, ఘోడే కాబ్, దోమలగూడ, గాంధీనగర్, ఎమ్మెల్యే కాలనీ, తట్టిఖానా, ఎన్బీటీ నగర్, నూర్ నగర్ తదితర ప్రాంతాల్లో నీటి సరఫరా
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మిల్కీ బ్యూటీ తమన్నా శివశక్తిగా మారిపోయారు. ఆమె నటిస్తున్న తాజా చిత్రం "ఓదెల-2". ఈ చిత్రం నుంచి ఫస్ట్ లుక్‌ను మూవీ మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ చిత్రం వారణాసిలో షూటింగ్ జరుపుకుంటుంది. ఆ సమయంలో తీసిన కొన్ని ఫోటోలను ఇటీవల దర్శకుడు సంపత్ నంది తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.
గత 2022లో వచ్చిన "ఓదెల రైల్వే స్టేషన్" చిత్రం ఓటీటీలో విడుదలై సూపర్ హిట్ సాధించింది. దీనికి సీక్వెల్‌గా ఓదెల-2ను తెరకెక్కిస్తున్నారు. ఇందులో తమన్నా శివశక్తి పాత్రను పోషిస్తున్నారు. ఈ పాత్ర ఆమె తనను తాను మార్చుకుందనే చెప్పాలి. సాధువుగా వేషం, ఒక చేతిలో కర్ర, మరో చేతిలో ఢమరుకం, నుదుటిపై పసుపు బొట్టు, దానిపై కుంకుమ బిందువుతో తమన్నా అచ్చం శివశక్తిలానే కనిపిస్తుంది.
కాశీ ఘాట్‍లో ఆమె కళ్లు మూసుకుని దేవుడుని ప్రార్థిస్తున్నట్టుగా తాజాగా విడుదలైన పోస్టర్ ఉంది. కాగా శివశక్తి పాత్రలో నాగ సాధవుగా తమన్నా కనిపించనున్నారు. ఇప్పటివరకు కనిపించినట్టుగా గ్లామర్‌గా ఈ మూవీలో కనిపించే అవకాశం లేదు. దర్శకుడు సంపత్ నంది ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. అశోక్ తేజ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు.