మేతకు వెళ్లిన 140 ఆవులు మృతి.. ఎక్కడ?

శనివారం, 16 జులై 2022 (10:55 IST)
తెలంగాణా రాష్ట్రంలో విషాదం జరిగింది. అడవిలో మేతకు వెళ్ళిన అవుల్లో 140 ఆవులు విగతజీవులుగా మారాయి. మరికొన్ని ఆవుల ఆచూకీ తెలియరాలేదు. ఈ ఘటన రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని వీర్నపల్లి మండలం మద్దిమల్ల, రుద్రంగి మండలం దేగావత్‌తండాలో శుక్రవారం జరిగిన ఈ ఘటన స్థానికంగా ప్రతి ఒక్కరినీ కలిసివేస్తుంది. 
 
మద్దిమల్లతండాకు చెందిన 23 మంది రైతులకు చెందిన 129 ఆవులు మూడు రోజుల క్రితం సమీపంలోని అటవీ ప్రాంతానికి మేరకు వెళ్లాయి. అవి చీకటిపడినా తిరిగి ఇంటికిరాలేదు. దీంతో వాటి ఆచూకీని కనుగొనేదుకు రైతులు అటవీ ప్రాంతాన్ని జల్లెడపట్టగా, ఒకేచోట 140 ఆవులు మరణించివుండటాన్ని చూసి వారు నిర్ఘాంతపోయారు. మరో 89 ఆవుల ఆచూకీ తెలియలేదు. వాటికోసం గ్రామస్థులు గాలిస్తున్నారు. ఆవులు మృతికి కారణంగా శరీర ఉష్ణోగ్రతలు తగ్గడం వల్లే మరణించివుంటాయని పశువైద్యాధికారులు అంటున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు