చొక్కా, కోటు, ధోతీ, షేర్వాణి ధరిస్తారు... హిజాబ్‌పై రాజకీయాలు చేస్తారు : సీఎం కేసీఆర్
దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన హిజాబ్ వివాదంపై కర్నాటక హైకోర్టు మంగళవారం సంచలన తీర్పును వెలువరించింది. ఈ తీర్పుతో ఈ వివాదం సద్దుమణిగిపోయింది. అయితే, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ హిజాబ్ వ్యవహారంపై స్పందించారు. బెంగుళూరులో హిజాబ్ పంచాయతీ పెండుతున్నారంటూ ఆరోపించారు.
ఒకరు చొక్కా, మరొకరు నడుము వరకు కోటు, మరొకరు ధోతీ లేదా షేర్వాణి ధరించవచ్చు. కానీ వారు మాత్రం హిజాబ్ పాలిటిక్స్ చేస్తారు. అయితే, భాగ్యనగరి వాసులు నగరంలో ప్రశాంతంగా జీవిస్తూ కర్ఫ్యూ, హింస, 144 సెక్షన్ వంటివి లేకుండా చేశారు. అందుకు నగర వాసులను అభినందించాలి అని సీఎం కేసీఆర్ అన్నారు.