పోలీసులను బ్లాక్ మెయిల్ చేసిన కిలాడి లేడీ అరెస్ట్

బుధవారం, 10 ఫిబ్రవరి 2021 (19:53 IST)
కిలాడి లేడీని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులతో పరిచయాలు పెంచుకుని వారినే బ్లాక్ మెయిల్ చేస్తున్న కిలాడి లేడీ లతారెడ్డిని రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. లతారెడ్డి నగరంలో టైలర్‌గా పని చేస్తూ జీవనం కొనసాగించేది. ఏదో ఒక విషయంలో నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్లకు వెళ్లి పోలీసులతో పరిచయాలు పెంచుకునేది. ఆ తరువాత వారితో చనువుగా ఉంటూ ఫొటోలు దిగేది. 
 
వీటి సాయంతో ఆరుగురు ఎస్సైలను లతారెడ్డి బ్లాక్ మెయిల్ చేసింది. వారి వద్ద నుంచి భారీగా డబ్బులు వసూలు చేసింది. తర్వాత వారిపై పోలీస్ ఉన్నతాధికారులకు లతారెడ్డి ఫిర్యాదు చేసేది. అయితే ఆమె ఆగడాలు తమకు తెలిసినా లతారెడ్డిపై ఫిర్యాదు చేసేందుకు పోలీసులు ముందుకు రాలేదు. ఎట్టకేలకు ఓ ఎస్సీ, ఎస్టీ కేసులో లతారెడ్డిని రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు