మద్యం మత్తులో నగ్నంగా చిందులేసింది.. ప్రియుడు మోసం చేశాడని..?

గురువారం, 21 జనవరి 2021 (14:13 IST)
గతంలో ప్రేయసి మోసం చేసిందని.. ఫూటుగా తాగి రోడ్డుపై తాగే సీన్లు చూసి వుంటాం. ప్రస్తుతం సీన్ మారింది. ప్రియుడు మోసం చేశాడని.. ఓ  యువతి తప్పతాగి రోడ్డుపై నానా హంగామా చేసింది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం అర్థరాత్రి ఓ యువతి మద్యం మత్తులో తూగింది.
 
రహ్మత్‌ నగర్‌ పోలీస్‌ అవుట్‌పోస్టు సమీపంలోని పార్కు వద్ద నగ్నంగా చిందులేసింది. గమనించిన అవుట్‌పోస్టు మహిళా పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని ఆమెకు దుస్తులు వేశారు. ఆ తర్వాత కొద్దిసేపటికే వాటిని సైతం యువతి చింపేసింది. దీంతో పోలీసులు మరోసారి ఆమెకు దుస్తులు అందించారు.
 
కూకట్‌పల్లికి చెందిన ప్రియుడు భరత్‌ తనను మోసం చేశాడని యువతి వాపోయింది. దీంతో ఆత్మహత్య చేసుకుంటానంటూ యువకుడికి ఫోన్‌ చేసింది. అనంతరం ఈ చర్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. యువతికి మద్యం మత్తు దిగే వరకు ఆశ్రయం ఇచ్చిన పోలీసులు అనంతరం ఆమెను కుటుంబసభ్యులకు అప్పగించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు