వేసవికాలం.. తెలంగాణలో ఒంటి పూట బడులు

మంగళవారం, 14 మార్చి 2023 (13:01 IST)
తెలంగాణలో బుధవారం నుంచి వేసవి కారణంగా ఒంటి పూట బడులు ప్రారంభం కానున్నాయి. మార్చి 15వ తేదీ నుంచి ఏప్రిల్ 24వ తేదీ వరకు ఒంటిపూట బడులు నిర్వహిస్తున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది.
 
వేసవి తీవ్రత కారణంగా ఒంటి పూట బడులను నిర్వహించాలని తెలంగాణ సర్కారు నిర్ణయించింది. ఉదయం 8 గంటల నుంచి 12.30 గంటల వరకు తరగతులు నిర్వహిస్తారు. 
 
అయితే పదో తరగతి పరీక్షలు జరుగుతున్న సమయంలో పరీక్షా కేంద్రాలు ఉన్న పాఠశాలల్లో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు తరగతులు నిర్వహించనున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు