వచ్చే నాలుగు రోజులు మండే ఎండలే ఎండలు... ఐఎండీ వార్నింగ్

మంగళవారం, 6 జూన్ 2023 (13:39 IST)
తెలంగాణ రాష్ట్రంలో వచ్చే నాలుగు రోజులపాటు మండే ఎండలే ఎండలేనని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ వేసవి కాలం ఆరంభం నుంచి రికార్డు స్థాయిలో పగటిపూట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జూన్ నెలలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ముఖ్యంగా, తెలంగాణ, ఏపీ, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, సిక్కింలలోని పలు ప్రాంతాల్లో ఇదే పరిస్థితి కొనసాగుతుందని ఐఎండీ హెచ్చరించింది. 
 
ముఖ్యంగా, తెలంగాణాలో 13 జిల్లాల్లో వచ్చే నాలుగు రోజుల పాటు ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని తెలిపింది. తెలంగాణాతోపాటు బెంగాల్, ఛత్తీస్‍‌గఢ్, సిక్కింలలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ప్రధానంగా పాలమూరు, ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల్లో మంగళవారం అత్యంధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతుయాని హెచ్చరించింది. 
 
జూన్ ఏడో తేదీ బుధవారం రోజున సూర్యాపేట, పాలమూరు, ఖమ్మం, నల్గొండ, ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లో, జూన్ 8, 9 తేదీల్లో అసిఫాబాద్, నిర్మాల్, మంచిర్యాల, ఆదిలాబాద్, పెద్దపల్లి, భూపాలపల్లి, కరీంనగర్, హన్మకొండ, వరంగల్, పాలమూరు, సూర్యాపేట, ఖమ్మం, నల్గొండ జిల్లాలలకు వాతావరణ శాఖ వేడి గాలుల హెచ్చరిక చేసింది. 
 
అందువల్ల ఆయా జిల్లాల వాసులు వీలైనంత మేరకు తమ ఇళ్లలోనే ఉండాలని ప్రజలకు సూచన చేసింది. అత్యవసర పరిస్థితులలో మాత్రమమే బయటకు వెళ్లాలని సూచన చేసింది. అలా వెళ్లేవారు వడదెబ్బబారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు