బుధవారం కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని, గురు, శుక్రవారాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉత్తర, దక్షిణ తెలంగాణలోని పలు జిల్లాల్లో కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
బుధవారం ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయంశకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం జిల్లాలలో రేపు, ఎల్లుండి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
అలాగే, నిర్మల్, నిజామాబాద్, కరీనగర్, ఉమ్మడి వరంగల్, జనగామ, సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల్లో రేపు, ఎల్లుండి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. కాగా, తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గత కొన్ని రోజలుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న విషయం తెల్సిందే.