winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

సిహెచ్

మంగళవారం, 17 డిశెంబరు 2024 (14:01 IST)
winter drinks చలికాలంలో జలుబు, దగ్గు రాకుండా ఆరోగ్యాన్ని కాపాడే పానీయాలు వేటిని తాగాలో తెలుసుకుందాము.
 
తులసి రసాన్ని గోరువెచ్చని నీటిలో కలిపి తాగితే ఆస్తమా, జలుబు, ప్లూ తదితర వ్యాధులు నిరోధిస్తుంది.
బీట్‌రూట్ రసం తాగడం వల్ల ఒత్తిడి, పలు రకాల క్యాన్సర్లను కూడా అడ్డుకుంటుంది.
అల్లం టీ లేదా గోరువెచ్చని అల్లం నీరు త్రాగుతుంటే శరీర రోగ నిరోధక శక్తి బలోపేతమవుతుంది.
గోరువెచ్చని టొమాటో సూప్ తాగడం వల్ల చెడుకొవ్వు కరిగి గుండె జబ్బులు రాకుండా వుంటాయి.
పసుపు పాలు సేవించడం వల్ల ఎముక పుష్టి, జీర్ణవ్యవస్థకి మేలు, మంచి నిద్ర కూడా పడుతుంది.
గోరువెచ్చని నీటిలో ఒక చెంచా తేనె కలుపుకుని తాగుతుంటే వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది.
ఉసిరి రసం తాగడం వల్ల కాలేయం, కిడ్నీ సంబంధ వ్యాధులను అడ్డుకుంటుంది.
గమనిక : వైద్యుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే ఇంటి చిట్కాలను ప్రయత్నించండి

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు