తిలక్‌నగర్ యూపీహెచ్‌సీలో కరోనా వ్యాక్సినేషన్‌ను ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో 140 కేంద్రాల్లో కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభమైందని తెలిపారు. తొలుత ఫ్రంట్ లైన్ వారియర్స్‌కే టీకా ఇస్తున్నారు.
ప్రధాని మోదీ సూచన మేరకు ప్రజాప్రతినిధులు ప్రస్తుతం టీకా తీసుకోవడం లేదన్నారు. ప్రజలతో పాటు ప్రజాప్రతినిధులు టీకా తీసుకుంటారు. కొవాగ్జిన్ టీకా హైదరాబాద్‌లో తయారు కావడం గర్వకారణంగా ఉందన్నారు. సురక్షితమైన టీకాలను హైదరాబాద్ నగరం ప్రపంచానికి అందిస్తుందని తెలిపారు. ప్రపంచంలో వినియోగించే ప్రతి మూడు వ్యాక్సిన్‌లలో ఒక వ్యాక్సిన్ హైదరాబాద్ నుంచి ఉత్పత్తి అయిందే ఉంటుందని పేర్కొన్నారు.