వివరాల్లోకి వెళితే.. వనస్థలిపురం సాహెబ్ నగర్ చెందిన బాలమణికి ఇబ్రహీంనగర్ బంజారా హిల్స్‌లో ఓ పత్రిక లోపని చేసే గొట్టేటి శివ ప్రసాద్ పరిచయం అయ్యాడు. ప్రసాద్ గత 4 సంవత్సరాలుగా వీళ్ళ ఇంటి ప్రక్కనే కిరాయికి ఉంటున్నాడని సమాచారం. ఆ పరిచయంతో ఆమె ఫోటోలు, వీడియోలు భర్తకు చూపించి సోషల్ మీడియా పెడతానని బాధిత మహిళని బెదిరించి లోబర్చుకున్నాడు శివ ప్రసాద్. ఇంకా శివ ప్రసాద్ అనే వ్యక్తి అత్యాచారం చెసినట్లు పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది. భర్తను చంపేసి తనతో వచ్చేయాల్సిందిగా ప్రసాద్ బెదిరిస్తున్నాడని పోలీసులకు తెలిపింది.
ఈ నెల 18వ తేదీన బాధిత మహిళ ఇంటికి చేరుకొని ఒంటరిగా ఉన్న సదరు మహిళను బెదిరించి అత్యాచారానికి పాల్పడితే ప్రతిఘటించి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది మహిళ. అతని వల్ల తమకు ప్రాణహాని వుందని రక్షణ కావాలని బాధిత మహిళ పోలీసులను కోరింది. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు 376, 506, సెక్షన్ క్రింద కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.