జమ్మూ కాశ్మీర్ లోని లడక్ లోని లేహ్ లో మహబూబ్ నగర్ జిల్లా గుండీడ్ మండలం గువ్వని కుంట తాండ కు చెందిన పరుశురాం ఆర్మీ లో హవాల్ధార్ గా పనిచేస్తు ఆన్ డ్యూటీ లో ప్రమాదవశాత్తు దేశ సేవలో అకాల మరణం చెందిన పరుశురాం భౌతిక కాయానికి రాష్ట్ర ఆబ్కారి, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు రంజిత్ రెడ్డి, పరిగి శాసన సభ్యులు మహేష్ రెడ్డితో కలసి శంషాబాద్ విమానాశ్రయంలో ఘనంగా నివాళులర్పించారు.
పరుశురాం సేవలకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం తరపున 25 లక్షల రూపాయల ఆర్ధిక సాయం, మహబూబ్ నగర్ పట్టణంలో డబల్ బెడ్ రూమ్ ఇంటిని పరుశురాం కుటుంబానికి అందిస్తున్నట్లు గా మంత్రి ప్రకటించారు. పరుశురాం కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.