షాపునకు వెళ్లివస్తున్న చిన్నారిని గమనించిన డిప్పు కుమార్ శ్రీవాత్సవ్ అలియాస్ దీపు(22) చాక్లెట్ ఇస్తానంటూ తనగదిలోకి తీసుకువెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. కాసేపటికి చిన్నారిని వెతుక్కుంటూ వచ్చిన కుటుంబ సభ్యులు దీపు గదిలోకి వెళ్లి చూడగా జరిగిన విషయం తెలిసింది. వారిని చూసిన డిప్పు కుమార్ అక్కడినుంచి పారిపోయాడు.
ఈ మేరకు చిన్నారి తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో జూబ్లీహిల్స్ పోలీసులు నిందితుడిపై పోక్సో చట్టంతో పాటు అత్యాచారం, కిడ్నాప్ కేసు నమోదు చేశారు. కేసులో పక్కా ఆధారాలు సమర్పించడంతో బుధవారం డిప్పు కుమార్కు 20ఏళ్ల జైలుశిక్షతో పాటు రూ.10వేల జరిమానా విధించారు.