బోరు బావుల్లో పిల్లలు పడటం, యంత్రాంగం అంతా చేరి పిల్లలను పైకి తీసే ప్రయత్నం చేయడం, చివరకు పిల్లల శవాలే పైకి తేవడం ప్రహసనంగా మారిందని బోరు బావికి అనుమతి ఇచ్చే అధికారులు కేవలం డబ్బు కక్కుర్తితో ఎక్కడ పడితే అక్కడ అనుమతులు ఇచ్చి ఆ బోర్ విఫలమైతే దానిని వెంటనే మూసి వేయడానికి చర్యలు చేపట్టడం లేదని పేర్కొన్నారు.
పనికిరాని బోరుబావులు వెంటనే మూసివేసేలా చర్యలు తీసుకోవాల్సిన అధికారుల నిర్లక్ష్యంతో పసిపిల్లలు ప్రాణాలు కోల్పోతున్నారని బోరు బావి వేసే రిగ్ యజమానులు సైతం నిరర్థక బోరు బావుల మూసివేతలో విఫలమౌతున్నారని వారిపై రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టడం లేదని మెదక్ జిల్లాలో జరిగిన ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, మృతి చెందిన బాలుడి కుటుంబానికి పది లక్షల రూపాయల పరిహారం చెల్లించాలని బాలల హక్కుల సంఘం డిమాండ్ చేస్తున్నది.