దీంతో పాటు ఏడేళ్ల టీఆర్ఎస్ పాలనపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతపై సర్వే చేయించాలనే యోచనలో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే క్రమంలో పార్టీ యంత్రాంగం, నాయకులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ప్రజాభిప్రాయాన్ని కూడా సేకరించాలని అనుకుంటున్నట్లు సమాచారం.
ఈ నేపథ్యంలోనే టీఆర్ఎస్ అధిష్ఠానం పీకే టీమ్‌ను సంప్రదించినట్లు తెలుస్తోంది. మరోవైపు తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానంటూ ఆర్భాటంగా పార్టీ స్థాపించిన వైఎస్ షర్మిలకు సైతం పీకే టీమ్ సేవలు అందిస్తుండటం విశేషం. పీకే టీమ్‌లో క్రియాశీలకంగా ఉండే ప్రియా రాజేంద్రన్.. షర్మిల పార్టీ కోసం వ్యూహాలను రచిస్తున్నారు. షర్మిల చేపట్టిన పాదయాత్ర సమయంలో కూడా ప్రియ రాజేంద్రన్ అనేక సలహాలను అందజేశారు.