అయితే, కరోనా మూడో దశ ఉంటుందా? లేదా? అన్నది పక్కన పెడితే.. ఒకవేళ కొవిడ్ కేసులు పెరిగితే ఎదుర్కొనేలా వైద్య ఆరోగ్యశాఖ ముందుగానే ప్రణాళిక సిద్ధం చేస్తోంది. కరోనా చికిత్సలకు నోడల్ కేంద్రంగా ఉంటున్న గాంధీలో అదనంగా మరో 600 పడకలను ఏర్పాటు చేస్తున్నారు.
మరోవైపు మూడో దశ పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపుతుందనే విశ్లేషణల నేపథ్యంలో పిల్లల చికిత్సల కోసం గ్రౌండ్, మొదటి, రెండో అంతస్తుల్లో ఆక్సిజన్, ఐసీయూలతో కూడిన మరో 300 పడకలను అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. వారం పది రోజుల్లో ఈ పనులు కొలిక్కి రానున్నాయి. మొత్తం పడకల సంఖ్య 2,500 వరకు చేరనున్నాయి.