ఈ సందర్భంగా రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, మహిళల రక్షణ, శిశు సంక్షేమం కోసం పనిచేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికీ అతివలు వివక్షకు గురవుతున్నారని తెలిపారు.
కాగా, మహిళా కమిషన్ సభ్యులుగా షాహీన్ ఆఫ్రోజ్, గద్దల పద్మ బాధ్యతలు స్వీకరించారు. కుమ్ర ఈశ్వరీబాయి, సుదాం లక్ష్మి, ఉమాదేవి యాదవ్, రేవతీరావు సభ్యత్వ బాధ్యతలు చేపట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సునీత 2010 నుంచి 2014 ఏప్రిల్ వరకు రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ మంత్రిగా పనిచేశారు. మహిళా కమిషన్ ఈ శాఖ పరిధిలోనిదే. ఇప్పుడు ఆమె ఆ కమిషన్కు ఛైర్పర్సన్గా నియమితులయ్యారు.