ఈ నెల 25వ తేదీ నుంచి రాష్ట్రంలో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు జరుగనున్నాయనీ, ఇపుడు పరీక్షలను రద్దు చేయాలని కోరుతూ పిటిషన్ వేస్తే ఎలా అంటూ తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రశ్నించింది. పైగా, చివరి నిమిషంలో పరీక్షల రద్దుపై జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది.