ఆదివాసీ ప్రజల 75 యేళ్ల సుధీర్ఘ పోరాటానికి ప్రతిఫలం దక్కింది. తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లా మంగపేట మండలంలోని 23 గ్రామాలు షెడ్యూల్ ప్రాంతాలేనని తెలిపింది. ఆ గ్రామాలు రాజ్యాంగంలోని ఐదో షెడ్యూల్ పరిధిలోకి వస్తాయని స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భుయాన్ బెంచ్ సారథ్యంలోని ధర్మాసనం బుధవారం సంచలన తీర్పునిచ్చింది.
కాగా, ఆదివాసుల తరపున న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపించారు. రాజ్యాంగ పరిధిలోని ఐదో షెడ్యూల్ పరిధిలోకి సదరు 23 గ్రామాలు రావంటా ఆదివాసీయేతర రాజకీయ నేతలు కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో ఎట్టకేలకు ఆదివాసీలకు కోర్టు అనుకూలంగా తీర్పునిచ్చింది.