హైదరాబాద్ నగరంలో వెలుగు చూసిన ఈ విషాదకర ఘటన వివరాలను పరిశీలిస్తే, నగరానికి చెందిన ప్రియాంక, ప్రవీణ్ అనే దంపతులు ఉన్నారు. వీరు బాలానగర్ సమీపంలో నివసిస్తుంటారు. టిక్ టాక్‌లో వీడియోలు పోస్టు చేయడం ప్రియాంకకు ఓ వ్యసనంగా మారిపోయింది.
దాంతో భార్యాభర్తల మధ్య కలహాలు తీవ్రమయ్యాయి. తీవ్ర ఆవేదనకు లోనయ్యాడు. భార్య తన మాట వినడంలేదని భావించిన ప్రవీణ్ బలవన్మరణం చెందాడు. దీనిపై ప్రవీణ్ తల్లిదండ్రులు బాలానగర్ పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేశారు. ప్రియాంక కారణంగానే తమ కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని వారు ఆరోపిస్తున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.