టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా పనిచేస్తున్న కాలంలో బడుగుల లింగయ్య యాదవ్ 2015 మార్చి 13వ తేదీన తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. కేతేపల్లి మండలం బీమారం గ్రామానికి చెందిన బడుగుల లింగయ్య, టీడీపీ స్థాపించిన 1982 నుంచి పార్టీలో కొనసాగారు. పదేండ్ల పాటు పార్టీ మండలశాఖ అధ్యక్షుడిగా పనిచేశారు.
ఆ తర్వాత పదకొండు ఏళ్ల పాటు పార్టీ జిల్లా శాఖ అధ్యక్షుడిగా పనిచేశారు. బీమారం గ్రామంలో ఎంపిటిసిగా పోటీ చేసి గెలుపొందారు. తర్వాత స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటాలో నల్లగొండ జిల్లా నుంచి పోటీ చేసి ప్రస్తుత శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ నేతి విద్యాసాగర్ మీద ఓడిపోయారు. 2015 మార్చి 16వ తేదీన బడుగల టిఆర్ఎస్ పార్టీలో చేరారు. బడుగుల రాజకీయ అనుభవం, పార్టీ పట్ల విధేయుడుగా ఉండటం గమనించిన కెసిఆర్ రాజ్యసభ అభ్యర్థిగా ఖరారు చేసారు.