తమిళంలో సంచలన విజయం సాధించిన "వసూల్" చిత్రాన్ని లక్ష్మీ బాలాజీ సినిమా ప్రొడక్షన్ పతాకంపై అడ్డాల. వెంకటరావు, చింతలపూడివాసు సంయుక్తంగా తెలుగుప్రేక్షకులకు "వసూల్‌రాణి" పేరుతో అనువదిస్తున్నారు.
సెక్సీస్టార్ కిరణ్ రాథోడ్ ప్రధాన పాత్రలో రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం తెలుగు డబ్బింగ్ కార్యక్రమాలను త్వరలో ప్రారంభించనున్నట్లు చిత్ర నిర్మాతలు తెలిపారు.
తమిళంలో సంచలన విజయం సాధించిన "వసూల్" చిత్రాన్ని "వసూల్ రాణి" పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నామని నిర్మాతలు వెల్లడించారు. డబ్బే ప్రధానం. డబ్బు సంపాదించడానికి ఏం చేసినా తప్పులేదు.. అనే ధృఢమైన అభిప్రాయంతో మోసాలు చేసే ఓ సినిస్టార్ కథ ఈ చిత్రం.
ఇందులో ఓ యువకుడు ఓ సినీస్టార్‌ను గాఢంగా ప్రేమించి మోసపోవడంతో తన మిత్రుని సాయంతో ఆ నటిని హతమార్చడానికి ప్రయత్నిస్తాడు. చివరికి ఆ యువకుడు ఎలాంటి పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందన్నదే చిత్ర రూపకల్పన అని నిర్మాతలు తెలియజేశారు.
సినీస్టార్‌గా కిరణ్‌రాథోడ్ ప్రధాన పాత్రలో నటించింది. ఆద్యంతం ప్రేక్షకులను అలరించే రొమాంటిక్ సన్నివేశాలతో ఈ చిత్రం రూపొందిందని నిర్మాతలు వెల్లడించారు. ఈ నెల 20 నుంచి చెన్నైలో డబ్బింగ్ కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. అద్భుతమైన 5 పాటలను మంచి లొకేషన్స్‌లో చిత్రీకరించడం జరిగిందని వారు తెలిపారు.
కిరణ్ రాథోడ్, హేమంత్, షిరాజ్, పల్లవి ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి సంగీతం: విజయశంకర్, మాటలు: మల్లాది వెంకట్, పాటలు: వెన్నెలకంటి, పొందూరి, దర్శకత్వం: రిషిరాజ్, నిర్మాతలు: అడ్డాల వెంకట్రావ్, చింతలపూడి వాసు.