డమరుకం దర్శకుడిని వెంటాడుతున్న బ్యాడ్ టాక్..!!

గురువారం, 25 అక్టోబరు 2012 (22:43 IST)
WD
నాగార్జున నటించిన డమరుకం చిత్రానికి దర్శకుడు శ్రీనివాసరెడ్డి. ఏవో చిన్నహీరోలతో చిత్రాలు తీసుకునే ఆయనకు ఒక్కసారిగా నాగార్జున డేట్స్‌ ఇవ్వడం. ఆర్‌ఆర్‌ మూవీమేకర్స్‌ ప్రతిష్టాత్మకంగా చిత్రాన్ని తీయడం ఆరంభంలోనే ఇదేదో కొత్త కాంబినేషన్‌ అనుకున్నారు.

ఏడాదిన్నరపాటు చిత్రం తీసినా ఇంకా రిలీజ్‌కు కుదరలేదు. గ్రాఫిక్స్‌ ప్రాబ్లమ్స్‌ వల్ల సినిమా ఆలస్యమయిందని కొన్ని సాంకేతిక కారణాలు చెప్పినా... చిత్రానికి భారీ బడ్జెట్‌ కావడంతోపాటు దర్శకుడు తీసిందానికి బయ్యర్లెవరూ ఉత్సాహం చూపకపోవడం మరో కారణమని చెపుతున్నారు. ఆల్‌రెడీ సినిమా సిద్ధమైంది. ఇప్పుడు గ్రాఫిక్స్‌ కూడా ప్రాబ్లమ్‌ లేదు. అయితే ట్రైలర్స్‌ ఎక్ప్‌ట్రార్డినరీగా ఉన్నాయని రిలీజ్‌నాడే అందరూ అనుకున్నారు.

ఎన్ని బాగున్నా... భారీగా ఈ చిత్రాన్ని కొనడానికి కొన్ని ఏరియాలకు డిస్ట్రిబ్యూటర్లు రాకపోవడం విశేషం. నైజాంలో దిల్‌ రాజు తీసుకున్నాడు. కెమెరామెన్‌ గంగతో రాంబాబు కూడా ఆయనే తీసుకుని విడుదల చేశారు. అయితే కాంట్రవర్సీతో ఆయన చిత్ర కలెక్షన్లను పొగొట్టుకున్నారు.

ఇప్పుడు డమరుకం అయినా బాగా ఆదరిస్తారని అనుకుంటుంటే.. అది అయోమయంలో పడేసింది. నాగార్జునకు దసరా నాటికి సినిమా విడుదల కావాలని పట్టుబట్టారు. కానీ ఆయన చేయి దాటిపోవడంతో.. ఇప్పుడు ప్రమోషన్‌కు కూడా రావడానికి ఇష్టపడటం లేదని ఫిలింనగర్‌ కథనం.

ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసిన ఈ చిత్రం భారీస్థాయిలో ఆడకపోతే మనసేదో అవుతుందని భావిస్తున్నారట. గతంలో చిత్ర దర్శకుడు శ్రీనివాసరెడ్డి.. ఓ ఎన్‌.ఆర్‌.ఐ.చేత భారీగా ఖర్చు చేయించి... సినిమాను రూపొందిస్తానని చివరి నిముంలో హ్యాండిచ్చాడని తెలిసింది. అదే అతన్ని వెంటాడుతూ ఆయన సినిమాలపై పడుతోందని ఫిలింనగర్‌లో టాక్‌.

వెబ్దునియా పై చదవండి