ప్రతి ఇద్దరిలో ఒకరు సెక్స్ సీన్లు ఇష్టపడుతున్నారు : మంచులక్ష్మి
File
FILE
ప్రపంచంలోని ప్రతి ఇద్దరిలో ఒకరు శృంగార సన్నివేశాలను చూసేందుకు ఇష్టపడుతున్నారని హీరో మోహన్‌బాబు కుమార్తె, నటి మంచు లక్ష్మి చెపుతోంది. అందువల్ల 'ఏ ఉమెన్ ఇన్ బ్రహ్మణిజం' చిత్రంపై వివాదాస్పదం చేయడం తగదని ఆమె హితవు పలుకుతున్నారు.
ఈ చిత్రం విడుదల కాకముందే తీవ్రస్థాయిలో వివాదం చెలరేగింది. ముఖ్యంగా.. చిత్రం విడుదల కాకుండా అడ్డుకోవాలంటూ పలు బ్రాహ్మణ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, సెన్సార్ బోర్డుకు కూడా ఫిర్యాదు చేసింది. ఈ చిత్రంపై సినీ పరిశ్రమకు చెందిన ఏమాత్రం స్పందించక పోయినప్పటికీ.. మంచు లక్ష్మి మాత్రం తన మనస్సులోని మాటను వెల్లడించింది.
శృంగారం అనేది.. మనం అసహ్యించుకునేంత హీనమైనది కాదన్నారు. ఒక అంతర్జాతీయ అధ్యయనం మేరకు ఈ ప్రపంచంలో ఉన్న స్త్రీపురుషుల్లో ప్రతి ఇద్దరిలో ఒకరు అశ్లీల దృశ్యాలను చూసేందుకు ఇష్టపడుతున్నారన్నారు. ప్రధానగా... సన్నీ లియోన్ వంటి పోర్న్ స్టార్‌ను చిత్రపరిశ్రమ హీరోయిన్‌గా ఆహ్వానించగా, ఇలాంటి సినిమాలను ఎందుకు ఆహ్వానించలేక పోతున్నారని ఆమె మండిపడ్డారు.
తెలుగులో ఈ తరహా చిత్రాలు రావడం ఇదేమి కొత్తగా కాదన్నారు. అనేక మసాలా చిత్రాలు వచ్చాయన్నారు. అలాంటి తరహాలోనే ఈ చిత్రాన్ని కూడా తీశారని మంచు లక్ష్మి చెప్పుకొచ్చారు.