వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ "మౌనపోరాటం" యమున

శుక్రవారం, 21 జనవరి 2011 (17:59 IST)
FILE
సినీనటి యమున వ్యభిచారం నిర్వహిస్తూ పోలీసులకు పట్టుబడింది. బెంగళూరులోని ఐటీసీ గార్డెన్ హోటల్లో గురువారం రాత్రిపూట యమునతోపాటు మరో తొమ్మిదిమంది వ్యభిచారం చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. వీరిలో ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీ యజమాని వేణుగోపాల్, సురక్షిత అనే మహిళ కూడా ఉన్నారు.

ప్రముఖ నిర్మాత రామోజీరావు నిర్మించిన "మౌనపోరాటం" చిత్రంతో తెలుగుతెరపై గుర్తింపు తెచ్చుకున్న యమున తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలతోపాటు బుల్లితెరపై అనేక సీరియళ్లలో నటించింది.

యమున అరెస్టయిన తర్వాత ఆమెను విడిపించేందుకు బెంగళూరుకు చెందిన సినీ ప్రముఖులు కొందరు తీవ్ర యత్నం చేసినట్లు భోగట్టా. ఇదిలావుంటే యమున నిర్వహిస్తున్న వ్యభిచారం వెనుక పెద్ద సెక్స్ రాకెట్ ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు నగర పోలీస్ కమీషనర్ చెప్పారు.

వెబ్దునియా పై చదవండి