శివరాత్రికి ప్రేక్షకుల ముందుకు బాలకృష్ణ "అధినాయకుడు"

శనివారం, 31 డిశెంబరు 2011 (17:50 IST)
WD
నందమూరి బాలకృష్ణ మూడు పాత్రలను పోషిస్తున్న చిత్రానికి అధినాయకుడు అని పేరు ఖరారు చేశారు. ఈ విషయాన్ని శనివారంనాడు చిత్ర నిర్మాత ఎం.ఎల్‌.కుమార్‌ చౌదరి వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. నూతన సంవత్సర శుభాకాంక్షలు. టైటిల్‌ అనౌన్స్‌ ఈరోజు చేశాం. అనుకున్న టైమ్‌కు దర్శకుడు పరుచూరి మురళి పూర్తి చేశాడు.

అతను పడ్డ కష్టం మాటల్లో చెప్పలేం. ఈ సినిమా బాలకృష్ణకి, మా బేనర్‌కు మంచి పేరు తెస్తుంది. మూడు గెటప్స్‌లో బాలయ్య కన్పించబోతున్నారు. అధినాయకుడు అనే పేరును పరుచూరి మురళి సూచించాడు. మూడు పాత్రల్ని చేయడం మామూలు విషయం కాదు. బాలకృష్ణ ఎప్పుడూ చేయని పాత్ర ఇది. చాలా వపర్‌ఫుల్‌ రోల్‌ ఇది. కర్నూల్‌లో ఒక పాట తీశాం.

అక్కడ ప్రజల నుంచి చాలా స్పందన వచ్చింది. భాస్కరభట్ల చక్కటి సాహిత్యం ఇచ్చాడు. కళ్యాణ్‌మాలిక్‌ సంగీతం చిత్రానికి హైలైట్‌గా ఉంటుంది. ఆరు పాటలు అద్భుతంగా వచ్చాయి. ఐదు పాటలు భాస్కరభట్లే రాశాడు. సంక్రాంతి తర్వాత ఆడియోను విడుదల చేసి, శివరాత్రికి సినిమాను విడుదల చేస్తాం అన్నారు.

దర్శకుడు మాట్లాడుతూ. బాలకృష్ణతో సినిమా చేయడమంటే చాలా భయమేసింది. అధినాయకుడు అనగానే ఎలా చేయాలో ఏం చేయాలి... అన్న డైలమాలో ఉన్నాను. పెద్ద గెటప్‌ వేసిన రోజు నేను వణికిపోయాను. బాలయ్య నన్ను చూసి టెన్షన్‌ పడుతున్నాడని కోడైరెక్టర్‌ని అడిగారు.. ఆ తర్వాత నేను.. మిమ్మిల్ని చూస్తుంటే... మీ నాన్నగారిని దర్శకత్వం వహిస్తున్నట్లుంది.. అందుకే భయపడ్డాను అని చెప్పాను. అంత పవర్‌ఫుల్‌ పాత్ర బాలకృష్ణగారిది. 55 రోజుల్లో సినిమా తీశాం. మా టెక్నీషియన్స్‌ అంతా చాలా కష్టపడ్డారు. నిర్మాతకు మంచి పేరు వస్తుందనే నమ్మకముందని తెలిపారు.

ఇంకా జయసుధ, సుకన్య, బ్రహ్మానందం, కోటశ్రీనివాసరావు, చరణ్‌రాజ్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: కళ్యాణ్‌మాలిక్‌, కెమెరా: సురేందర్‌రెడ్డి, కథ - మాటలు - స్క్రీన్‌ప్లే - దర్శకత్వం: పరుచూరి మురళి.

వెబ్దునియా పై చదవండి