చంద్రకళ రివ్యూ రిపోర్ట్: హన్సిక ఏక్టింగ్ అదుర్స్.. భయపెట్టడం కంటే.. నవ్వించేశారు..!

శనివారం, 20 డిశెంబరు 2014 (13:54 IST)
తారాగణం: ఆండ్రియా, హన్సిక, సుందర్‌ సి., వినయ్‌, సంతానం, రాయ్‌ లక్ష్మి, కోట శ్రీనివాసరావు, కోవై సరళ తదితరులు.
 
నిర్మాణం: శ్రీ శుభశ్వేత ఫిలింస్‌, కథనం: ఎస్‌.బి. రామదాస్‌, సంగీతం: భరద్వాజ్‌, నేపథ్య సంగీతం: కార్తీక్‌ రాజా, కూర్పు: ఎన్‌.బి. శ్రీకాంత్‌, ఛాయాగ్రహణం: యు.కె. సెంథిల్‌ కుమార్‌, నిర్మాతలు: శ్వేతలాన, వరుణ్‌, తేజ, సి.వి. రావు, కథ, దర్శకత్వం: సుందర్‌ సి.
 
కెమెరా: యు.కె. సెంథిల్‌కుమార్‌, కథనం ఎస్‌బి. రామదాస్‌, సంగీతం: భరద్వాజ్‌, నిర్మాతలు: శ్వేతలాన, వరుణ్‌, తేజ, సి.వి. రావు, కథ, దర్శకత్వం: సుందర్‌ సి.
 
తమిళ సినిమాలు తెలుగులో డబ్‌ అయ్యేచిత్రాలు ఈ ఏడాది చాలానే వచ్చాయి. అందులో ప్రేమ, యాక్షన్‌ చిత్రాలు ఒక టైప్‌ అయితే.. దెయ్యం అంటూ ఝడిపించేట్లుగా వుండే చిత్రాలు ఈ ఏడాది తక్కువే అని చెప్పాలి. ఈ ఏడాది చివరగా అలా తెలుగు ప్రేక్షకులను భయపెట్టేందుకు వచ్చిన తమిళ చిత్రం 'అరన్‌మనై'. ఈ చిత్రాన్ని ఖలేజా నిర్మాత సి.కళ్యాణ్‌ తెలుగులో 'చంద్రకళ'గా డబ్‌ చేశారు. అయితే ఈ చిత్రం ఎక్కడా ఫీల్‌లేకుండా సాగిపోతుంది. తమిళంలో విజయవంతమైన ఈ చిత్రం తెలుగులో ఎలా వుందో చూద్దాం.
 
కథగా చెప్పాలంటే...
చాలాకాలంగా రాజులనాటి భవనం ఆయన వారసులు వచ్చి బేరానికి పెడతారు. అందుకు రెండే రోజులు గడువుండడంతో టెంపరరీ మరమ్మత్తులు చేస్తారు హక్కుదారు. రిజిష్టర్‌ రోజున ఆస్తి కాగితాలు తడిసిపోతాయి. అలా ఒక్కో సంఘటన ప్యాలెస్‌లో జరుగుతాయి. వాటిని ముందుగా తేలిగ్గా తీసుకున్నా.. వారసురాలులో ఆండ్రియా అన్న సుందర్‌సి వచ్చాక నిఘా పెడతాడు. నిజంగా దెయ్యం వుందని గ్రహించి దాన్ని బయటకు పంపాలని చూస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు దెయ్యం అక్కడే ఎందుకు వుందనేది చిత్రంలోని పాయింట్‌.
 
పెర్‌ఫార్మెన్స్‌: 
సినిమా అంతా ఎక్కువగా కన్పించేది ఆండ్రియానే. దెయ్యం పట్టిన మనిషిగా బాగా ఏక్ట్‌ చేసింది. హీరోయిన్‌గా హన్సిక ఇంతకుముందు చేసింది కాబట్టి ఆమె పేరును ఎక్కువగా పబ్లిసిటీ ఇచ్చారు. చంద్రకళగా హన్సిక చేసిన అమాయకత్వంతో పాటు చనిపోయేముందు తనలోని బాధను వ్యక్తం చేసే సన్నివేశాలు అద్భుతంగా ఆవిష్కరించింది. 
దర్శకుడు సుందర్‌ నటుడైతే ఏక్టర్‌ బాధ ఏమిటో తెలిసివస్తుంది. అందుకే ఆయన పెద్దగా నటించినట్లు కన్పించదు. వారసుడిలో ఒక వ్యక్తిగా సంతానం పాత్ర నవ్వు తెప్పిస్తుంది. రాయ్‌ లక్ష్మీ పాత్ర గ్లామర్‌కు బాగా ఉపయోగించుకున్నారు. స్వామిగా కోటశ్రీనివాసరావు పాత్ర మామూలే. కోవైసరళ, దండపాణి తదితరులు నటన రొటీన్‌గానే వుంది.
 
టెక్నికల్‌గా...
సినిమాటోగ్రఫీ చిత్రానికి ఆకర్షణ. హార్రర్‌ చిత్రాలకు ఇదే కీలకం. ఆ పని బాగుంది. ఎడిటింగ్‌, సంగీతం సోసోగా  వున్నాయి. గ్రాఫిక్స్‌ అంతర్జాలయం బాగుంది. చిత్రంలో ప్రత్యేకత అదే. స్క్రీన్‌ప్లే చాలా వీక్‌గా వుంది. లొకేషన్‌కూడా తెలుగువారికి తెలిసిన లొకేషన్‌ కావడంతో పెద్దగా కనెక్ట్‌కాలేడు.
 
విశ్లేషణ : 
చంద్రముఖి చిత్రం తర్వాత ఆ రేంజ్‌లో చిత్రాలు తీయాలని పలు చిత్రాలు వచ్చాయి. నాగవల్లి అనే చిత్రాన్ని సీక్వెల్‌గా వెంకటేష్‌ తీసి అభాసుపాలయ్యాడు. దాంతో అటువంటి కథలు చేయాలంటే కొత్తవారితో ట్రై చేస్తున్నారు. బహుశాసుందర్‌ సి.కూడా.. తమిళంలో వినయ్‌ను ఎంచుకున్నట్లున్నాడు. 
 
అయితే రజనీకాంత్‌ చేసిన పాత్రను ఇందులో సుందర్‌ సి. చేశాడు. తెలుగులో అమ్మోరు, అరుంధతి చిత్రాలు పెద్ద క్రేజ్‌ తెచ్చిపెట్టాయి. అందులో వున్న సస్పెన్స్‌, ఇన్‌వాల్వ్‌ అయ్యే సీన్స్‌ చంద్రకళలో ఏకోశామూ లేవు. మొదటిభాగంలో దెయ్యం వస్తుంది. వచ్చింది అన్నా పెద్దగా భయంకలగదు.
 
అయితే భయపెట్టడానికి బదులు.. నవ్వించమే ప్రధానంగా దర్శకుడు చేసిన తీరు బాగుంది. కోవై సరళ బ్యాచ్‌తోపాటు సంతానంబ్యాచ్‌ చేసిన సందడి నవ్విస్తుంది. ఇటువంటి కథాంశం చూస్తున్నంతసేపు... పాత చిత్రాలు గుర్తుకురావడం ప్రధాన లోపం. రాజమహల్‌ సెట్‌కూడా గత చిత్రాల మాదిరిగానే వుంది. ఇక ముగింపులో వచ్చే గ్రాఫిక్స్‌ సీన్స్‌ చిత్రాని ఆకర్షణ. తనను హత్యచేసినవారిని చంపేప్రయత్నంలో చంద్రకళ చేసే పోరాటం. ముని చిత్రాన్ని పోలి వుంటుంది. దాంతో ఫీల్‌ మిస్‌ అయింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వున్నాయి. ఇది ప్రత్యేకంగా వుందని చెప్పుకోవడానికి ఏమీలేదు.
 
ముఖ్యంగా... ఒక రాజమహల్‌.. దానిలో దెయ్యం వుంది. దాన్ని వదిలించడానికి ఓ స్వామీజీ. రావడం.. అనేది రొటీన్‌ కథ. ఈ చిత్రంలోనూ అలాగే వుండడంతో ఎక్కడా ప్రేక్షకుడు కనెక్ట్‌కాడు. చివరి పదిహేను సినిషాలు తప్పిస్తే.. సినిమాలో చెప్పుకోదగింది ఏమీలేదు. ఇప్పటికే బిజినెస్‌ అయిన ఈ చిత్రం నిర్మాతకు లాభాలు తెచ్చిపెట్టింది. ఇంకా వారం వరకు ఎటువంటిపెద్ద చిత్రాలు లేవుకాబట్టి.. అంతవరకు ఈ చిత్రం గ్యారంటీ ఆడవచ్చు.
 
రేటింగ్‌: 2.5

వెబ్దునియా పై చదవండి