అసలు వెన్నెముక ఉందా లేదా? సూర్య నమస్కారాలు వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్ర (video)

ఐవీఆర్

బుధవారం, 30 అక్టోబరు 2024 (22:03 IST)
సూర్యుడు లేకుంటే జీవితమే లేదు. అందుకే ఉదయాన్నే సూర్య నమస్కారాలు చేయాలని చెబుతారు. శరీరతత్వానికి, మేథస్సుకు బ్యాలెన్సింగ్‌గా ఉపయోగపడే ఈ సూర్య యోగాను దక్షిణ భారతంలో ఎక్కువగా ఆచరిస్తుంటారు. ఇక అసలు విషయానికి వస్తే... ప్రముఖ వ్యాపారవేత్త ఓ బాలిక చేస్తున్న సూర్య నమస్కారాలు వీడియో షేర్ చేస్తూ... ''నేను ఈ వీడియోను చూడక ముందు వరకూ చాలా ఆత్మవిశ్వాసంతో నా రోజువారీ సూర్య నమస్కారం చేస్తున్నాను… కానీ ఇప్పుడు నేను ఇప్పుడు ఈ వీడియో చూసాక భారీ ఇన్‌ఫీరియారిటీ కాంప్లెక్స్‌తో బాధపడుతున్నాను…'' అని ట్యాగ్ చేసారు.

సూర్యుడు ఉదయించే ముందు లేదా అస్తమయానికి 20 నిమిషాల ముందు అతి నీల లోహిత కిరణాలు తక్కువ మోతాదులో ఉండడంవల్ల సూర్య నమస్కారాలతో మేలు జరుగుతుందని యోగా గురువులు చెబుతున్నారు.
 
సూర్య నమస్కారాలు చేస్తూ ఉదయ సూర్యునికి ఎదురుగా చేయడం వలన శారీరక, మానసిక ఒత్తిడి దూరమవడంతోపాటు అంతర్లీనంగా శక్తి చేకూరుతుందని యోగా నిపుణులు సూచిస్తున్నారు. దీంతోపాటు కళ్ళకు దృష్టిలోపాలుంటేకూడా తొలగిపోతాయని వారంటున్నారు.
 
సూర్య నమస్కారాలు చేస్తుంటే జీర్ణావయవాలు ఉత్తేజితమవుతాయి. చాలా చురుకుగా పనిచేస్తాయి. ఫలితంగా జీర్ణశక్తి బాగా పెరుగుతుంది. చర్మంలో ఉన్న అసమానతలు, సమస్యలు తొలగిపోతాయి. చర్మం తాజాదనాన్ని సంతరించుకుంటుంది. వెన్నుపూసకు మరింత మేలు జరుగుతుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు