పూనమ్ పాండే అశ్లీల ఫోటోలు... ఫేస్‌బుక్ ఖాతా క్లోజ్ చేస్తూ షాక్

గురువారం, 28 ఆగస్టు 2014 (12:56 IST)
బాలీవుడ్ హాట్ బ్యూటీ పూనమ్ పాండేకు ప్రముఖ సోషల్ నెట్వర్కింగ్ వెబ్ సైట్ ఫేస్ బుక్ షాక్ ఇచ్చే నిర్ణయం తీసుకున్నది. పూనమ్ కు చెందిన ఫేస్ బుక్ ఖాతాను తొలగించేసింది. కారణాన్ని తెలుపుతూ... ఫేస్ బుక్ పేజీలో పూనమ్ పాండే అశ్లీలత మరీ ఎక్కువైపోయినందువల్లే ఫేస్ బుక్ ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 
 
కాగా పూనమ్ పాండే గత కొంతకాలంగా సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో విపరీతంగా ఎక్స్ పోజింగ్ చేస్తూ ఉండే ఫోజులను పెడుతూ వస్తోంది. ఈ ఫోజుల్లో కురుచ దుస్తులతో, అర్ధనగ్న ఫోటోలను అప్ చేస్తూ కుర్రాళ్లను రెచ్చగొట్టే విధంగా ఫోటోలను పెడుతోంది. కాగా తన ఫేస్ బుక్ ఖాతాను తొలగించడంపై పూనమ్ తెగ బాధపడిపోతోంది. 
 
నాకు నిజంగా షాకింగ్ న్యూసే అంటూ వగరుస్తోంది. తన ఖాతాను తిరిగి పొందాలంటే ఏం చేయాలో చెప్పమంటూ ట్విట్టర్లో అందరినీ బతిమాలుతోంది. ఎవరైనా దానిని పొందే సూచన తెలిస్తే చెబితే సంతోషిస్తానంటోంది. ఇంకానయం క్రికెట్ ప్లేయర్లకు ఇచ్చినట్లు ఏదైనా గిఫ్ట్ ఇస్తానని అనలేదు.

వెబ్దునియా పై చదవండి