పటాస్ సినిమాతో మంచి హిట్ ని కళ్యాణ్ రామ్ కొట్టేశాడు. వారం రోజుల్లో రూ.10 కోట్లు వసూలు చేసి సేఫ్ జోన్ లో ఉండిపోయింది. ఈ సినిమా రీమేక్ రైట్స్‌ను గురువారం కన్నడ దర్శకుడు కొనగా, శుక్రవారం తమిళ రీమేక్ రైట్స్ కూడా అమ్ముడుపోయాయి. తమిళంలో ప్రముఖమైన సూపర్ గుడ్ ఫిలిమ్స్ వారు రూ.63 లక్షలకి ఈ సినిమా రైట్స్ ని కొనుగోలు చేసుకున్నారు.