తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళా ఎస్ఐ దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదం గొల్లపల్లి మండలం చిల్వకోడూరు వద్ద కారు - బైకు ఢీకొన్న ఘటనలో ఎస్ఐ శ్వేతతో పాటు మరొకరు మృత్యువాతపడ్డారు. కారు తొలుత బైకును ఢీకొట్టి, ఆ తర్వాత చెట్టును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎస్ఐ శ్వేత ప్రాణాలు కోల్పోయారు.
ఆర్నకొండ నుంచి జగిత్యాల వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. శ్వేత కారును డ్రైవింగ్ చేస్తూ తొలుత బైక్‌ను, ఆ తర్వాత చెట్టును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆమె ప్రమాదస్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. శ్వేత మృతదేహాన్ని జగిత్యాల ఆస్పత్రికి తరలించారు. కాగా, జగిత్యాల పోలీస్ హెడ్‌క్వార్టర్‌లో విధులు నిర్వహిస్తున్నారు. గతంలో ఆమె కోరుట్ల, వెల్గటూరు, కథలపూర్, పెగడపల్లిలలో ఎస్ఐగా విధులు నిర్వహించారు.