టాలీవుడ్ టాప్ హీరోయిన్ అనుష్క త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నదట. బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్తను అనుష్క వచ్చే ఏడాదిలో పెళ్లి చేసుకునే అవకాశముందని వెబ్ మీడియాలో, సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం అనుష్క ‘బాహుబలి: ద కన్క్లూజన్’, ‘భాగమతి’ వంటి ప్రతిష్టాత్మక సినిమాల్లో నటిస్తోంది. మంగళూరుకు చెందిన అనుష్క 36 ఏళ్ల వయస్సులో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టనుందని టాక్ వస్తోంది.