సూపర్ స్టార్ రజినీకాంత్ కొత్త చిత్రం కబాలి చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈనెల 22వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది. తొలి రోజున ఏకంగా నాలుగు వేల థియేటర్లలో ఈ చిత్రం ప్రదర్శితం కానుంది. ఈ సినిమా చూసేందుకు రజనీ అభిమానులు, ప్రేక్షకులు అమితాసక్తి చూపుతున్నారు.
మరోవైపు.. తమిళనాడు రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో ఈ చిత్రం తొలి వారం రోజులకు టిక్కెట్లన్నీ అమ్ముడు పోయినట్టు ట్రేడ్ వర్గాల విశ్లేషణ. ఒక్కో టికెట్ను సగటున 600 రూపాయలకు అమ్మారని ప్రేక్షకులు చెబున్నారు. తమిళనాడులో సినిమా టికెట్లను 120 రూపాయలకు అమ్మాల్సిఉండగా, దీనికి ఐదురెట్లు అధిక ధరకు అమ్మినట్టు సమాచారం.