బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్‌పై హృతిక్ రోషన్ ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులో కంగనా రనౌత్‌పై హృతిక్ రోషన్ తీవ్ర ఆరోపణలు చేశారు. హృతిక్ రోషన్, నటి కంగనా రనౌత్‌ల వివాదం కోర్టుకెక్కిన నేపథ్యంలో.. గత ఏప్రిల్‌లో హృతిక్ తరపు లాయర్ మహేష్ జఠ్మలానీ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు వెలుగు చూసింది. ఈ వివరాలను రిపబ్లిక్ టీవీ బయటపెట్టింది. ఈ ఫిర్యాదులో కంగనా రనౌత్‌పై హృతిక్ రోషన్ ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.
2014లో ఆమె నుంచి అసభ్యకరమైన మెసేజ్‌లు వచ్చాయని.. హృతిక్ రోషన్‌ను ఉద్దేశించి కంగనా సోదరీ రంగోళీ కూడా ఈ-మెయిల్ ఇచ్చింది. అందులో కంగనాను మానసికంగా, భావోద్వేగపరంగా రేప్ చేశానంటూ ఆరోపించిందని హృతిక్ రోషన్ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. చివరికి హృతిక్‌ను ఉద్దేశించి కంగనా 'సిల్లీ ఎక్స్' అంటూ అభివర్ణించింది. దీంతో, గొడవ చినికిచినికి లీగల్ ఇష్యూ వరకు వెళ్లిన సంగతి తెలిసిందే.